మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో ప్రతీ వారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాబోయే వారం కంటెస్టెంట్స్ కి "స్కూల్ థీమ్" ని ఇచ్చారు. ఇక ఈ షోకి స్నేహ, శివబాలాజీ జడ్జెస్ గా ఉన్నారు. "స్కూల్లో లవ్ లెటర్స్ ఏమన్నా వచ్చాయా" అని హోస్ట్ శ్రీముఖి స్నేహని అడిగేసరికి " చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి వచ్చాయి" అని ఆన్సర్ చెప్పింది.
ఇక శ్రీవాణి ఫామిలీ అలాగే ఇంకొంతమంది కలిసి స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఫన్నీ స్కిట్ చేశారు. వీళ్లంతా క్లాస్ రూమ్ లో కూర్చుంటే టీచర్ వచ్చి పాఠాలు చెప్తూ "పండగంటే ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు " పండగ అంటే ఈటీవీ ఈవెంట్" అంటూ ఒక స్టూడెంట్ కొంటెగా ఆన్సర్ ఇచ్చింది. ఇంతలో రాకింగ్ రాకేష్ వచ్చి "శివ ధనుస్సు ఎవరు విరిచారు" కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి అని అడిగేసరికి శ్రీవాణి వెళ్లి " నేనేం విరవలేదు సర్" అంటూ ఏడ్చేసింది. అలాగే మరో టీం కంటెస్టెంట్స్ కూడా క్లాస్ రూమ్ స్కిట్ చేశారు. అందులో టీచర్ ఒక స్టూడెంట్ ని పిలిచి "కాఫీకి, కాలేజీకి ఉన్న తేడా ఏమిటి" అని అడిగారు. "కాఫీలో షుగర్ ఉంటుంది..కాలేజీలో ఫిగర్ ఉంటుంది" అంటూ ఆ స్టూడెంట్ కొంటెగా ఆన్సర్ చెప్పాడు.
తర్వాత సుష్మ-రవికిరణ్ టీమ్ ఒక ఎమోషనల్ స్కిట్ చేసి అందరినీ ఏడిపించారు. వీళ్ళ స్కిట్ చూసిన శివబాలాజీ "అమ్మలు ఎలా ఉంటారు అంటే పిల్లల్ని కొట్టేస్తారు తర్వాత లోపలికి వెళ్లి వాళ్ళు ఏడుస్తారు" అని ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు.